- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా అవకాశం ఇస్తాం.. కానీ దానికి ఒప్పుకోవాలి అని అడిగారు.. టాలీవుడ్‌పై నటి షాకింగ్ కామెంట్స్
కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన వైల్డ్‌డాగ్ సినిమా(Wild Dog Movie)తో నటి సయామీ ఖేర్(Saiyami Kher) టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన వైల్డ్‌డాగ్ సినిమా(Wild Dog Movie)తో నటి సయామీ ఖేర్(Saiyami Kher) టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి ముందే సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రేయ్ సినిమాలో సయామీ నటించినా అనుకున్నంత పాపులారిటీ రాలేదు. ప్రస్తుతం తెలుగు, హిందీ సహా అనేక భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా సయామీ ఖేర్ తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆమె ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కెరియర్ ఆరంభంలో ఎదుర్కొన్న విషయాలు పంచుకున్నారు. ‘అప్పుడు నాకు 19 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఓ తెలుగు సినిమాలో పాత్ర కోసం నాకు కాల్ చేశారు. మంచి పాత్ర అని.. మీరే చేయగలరు అని మాట్లాడారు. కానీ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుందని పరోక్షంగా అడిగారు. అయితే నాకు కాల్ చేసి మాట్లాడింది ఒక మహిళ. మహిళ నుంచి ఇలాంటి కాల్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలాంటి అవకాశాలు నాకేం వద్దు. నా టాలెంట్‌కు తగిన పాత్రలు వచ్చినప్పుడు చేస్తా అని ఫోన్ పెట్టేసా’ అని సయామీ ఖేర్ చెప్పుకొచ్చారు. కాగా, సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటినుంచో చర్చనీయాంశంగానే ఉంది. రోజుకో నటి దీనిపై మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా సయామీ ఖేర్ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






