- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Madhu Shalini : ఇదొక ఆర్గానిక్ ప్రేమ కథ.. నటి లేటెస్ట్ పోస్ట్ వైరల్
విభిన్న క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మధు శాలిని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్యా కుమారి’.

దిశ, సినిమా: విభిన్న క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మధు శాలిని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్యా కుమారి’. ఆర్గానిక్ ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గీత్ సైని, శ్రీ చరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది మధు శాలిని. ‘కొత్త ఆరంభాలు.. శ్రీకాకుళం నడిబొడ్డున జరిగే ఒక ఆత్మీయమైన ప్రేమకథగా మా ‘కన్యా కుమారి’ మీ ముందుకు రాబోతున్నది. ఈ ఆర్గానిక్ ప్రేమ కథ నిజమైన ప్రేమ, ఆప్యాయతలు, సంబంధాల గురించి మీకు పరిచయం చేస్తుంది’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రజెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా గణేష్ చతుర్థి స్పెషల్‌గా ఆగస్టు 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం చేశారు మేకర్స్. link






