- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓవైపు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌పై ట్రోల్స్.. అదే పాటకు మళ్లీ స్టెప్పులేసిన హీరోయిన్ (వీడియో)
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithiin), శ్రీలీల(Sreeleela) కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం రాబిన్ హుడ్(Robinhood Movie).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithiin), శ్రీలీల(Sreeleela) కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం రాబిన్ హుడ్(Robinhood Movie). ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మర్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇటీవలే ఓ సూపర్ హిట్ సాంగ్‌ను విడుదల చేశారు. అయితే.. అనూహ్యంగా ఈ పాటలో హీరోయిన్ వేసిన స్టెప్పులపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాటకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన శేఖర్ మాస్టర్‌పై నెటిజన్లు బూతులతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో అదే పాటకు హీరోయిన్ కేతిక శర్మ(Ketika Sharma) మరోసారి డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియా(Instagram) వేదికగా పోస్టు చేసింది. దీంతో కొందరు ఆమె ఎనర్జీని మెచ్చుకుంటుండగా.. స్టెప్పులు బాగోలేవని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
మరోవైపు.. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయ్యింది. దీంతో వరుస ఫ్లాపులతో సతమవతమవుతున్న నితిన్‌కు ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి శంకర్. నవీన్ నిర్మిస్తున్నారు.
READ MORE ...
Kareena Kapoor: ఇకపై శృంగార సన్నివేశాల్లో నటించను.. స్టార్ హీరోయిన్ కామెంట్స్






