- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెల్లంకొండ రిసెప్షన్.. స్పెషల్ అట్రాక్షన్‌గా కాజల్
బెల్లంకొండ రిసెప్షన్ జరిగిన తరుణంలో స్పెషల్ అట్రాక్షన్‌గా కాజల్ అగర్వాల్ నిలిచారు.

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన కాజల్ అగర్వాల్, ఎప్పుడు ఏడాదికి ఒక్కటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అయితే అలాంటి కాజల్ అగర్వాల్, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యా రెడ్డి రిసెప్షన్ సందర్భంగా హీరోయిన్ కాజల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. గ్రాండ్ డిజైన్, షైనింగ్ ఎంబ్రాయిడరీ ఉన్న లెహంగా చీరలో దర్శనమిచ్చారు కాజల్.
తన భర్త గౌతమ్ కిచ్ల్యూ కలిసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కాంబినేషన్ లో ఇప్పటికే సీత, కవచం లాంటి సినిమాలు వచ్చాయి. ఇక అటు ఈ రిసెప్షన్ కు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, వి వి వినాయక్, బోయపాటి శ్రీను, దిల్ రాజు, గోపీచంద్ లాంటి తదితర హీరోలు కూడా హాజరయ్యారు. కాగా రెండు రోజుల కిందట తిరుపతిలో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం జరగగా... నిన్న హైదరాబాద్ లో రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు.






