టాటూ అర్థం గురించి ఓపెన్ అయిన యాక్ట్రెస్ జ్యోతి.. ఆసక్తికర వ్యాఖ్యలు

by Pulgam srinivas |

జ్యోతి మాట్లాడుతూ... నా టాటూకి రంగుల జీవితం, విభిన్న జీవితం, స్వేచ్ఛగా ఎగిరే స్వభావం వంటి అర్థాలు ఉన్నాయని తెలిపింది.

టాటూ అర్థం గురించి ఓపెన్ అయిన యాక్ట్రెస్ జ్యోతి.. ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జ్యోతి ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చిన చిత్రాలలో 'పెళ్ళాం ఊరెళితే' ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇందులో తిలోత్తమ పాత్రలో నటించిన ఈమె తన నటనతో, అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీ తర్వాత అలాంటి పాత్రలు ఈ బ్యూటీకి అనేకం వచ్చాయి. అలాగే జ్యోతి 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 1'లో పార్టిసిపేట్ చేసి బుల్లితెర అభిమానుల మనసును కూడా దోచుకుంది.

గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో ఈమె చేసే సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఇక యాక్ట్రెస్ ఎవరికి భయపడకుండా ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి. దాంతో అనేక సందర్భాల్లో ఈమె మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే జ్యోతి ఎక్కువ శాతం ఎలాంటి డ్రెస్ వేసుకున్నా తన టాటూ ఫోకస్ అయ్యేలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. దాంతో చాలామంది ఈమె టాటూకు అర్థం తెలుసుకోవాలని ఆసక్తి చూపించారు.

తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన టాటూకి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ… "నేను ఈ టాటూ థాయిలాండ్‌లో 'కెవ్వు కేక' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వేయించుకున్నాను. మొదట దీని అర్థం ఏమిటి అనేది నాకు తెలియదు. డిజైన్ బాగుందని వేయించుకున్నాను. ఆ తర్వాత దీనికి రంగుల జీవితం, విభిన్న జీవితం, స్వేచ్ఛగా ఎగిరే స్వభావం వంటి అర్థాలు ఉన్నాయని తెలుసుకున్నాను" అని తెలిపారు.

Next Story