కదిలే రైలు నుంచి దూకిన నటి.. తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-12 04:22:49  IST  )

వేగంగా కదులుతోన్న ట్రైన్ నుంచి ప్రముఖ నటి దూకి గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కదిలే రైలు నుంచి దూకిన నటి.. తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: వేగంగా కదులుతోన్న ట్రైన్ నుంచి ప్రముఖ నటి దూకి గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాగిని MMS రిటర్న్స్‌ ఫేమ్‌, బాలీవుడ్‌ నటి కరిష్మా శర్మ (Karishma Sharma) ఫ్రెండ్స్‌తో కలిసి ఈనెల 10న లోకల్ ట్రైన్‌ (Local Train)లో ప్రయాణించేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అయితే, తన స్నేహితురాళ్లు తనతో పాటు ట్రైన్ ఎక్కలేదని గ్రహించిన కరిష్మా వేగంగా కదులుతోన్న ట్రైన్ నుంచి అమాంతం కిందకు దూకేసింది. దీంతో ఆమెకు తల, వీపు భాగంలో తీవ్ర గాయలయ్యాయి. ఈ మేరకు ఆమెను ఫ్రెండ్స్ హుటాహుటిన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తాను సేఫ్‌గానే ఉన్నట్లుగా నటి కరిష్మా శర్మ ఇన్‌స్టా‌గ్రామ్‌లో వెల్లడించింది.

Next Story