- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ వల్ల కడుపులో బిడ్డను కోల్పోయా.. బుల్లితెర నటి సంచలన ఆరోపణలు
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ పై బుల్లితెర నటి జూలీ సంచలన ఆరోపణలు చేసింది. విజయ్ వల్ల తన కడుపులో ఉన్న బిడ్డను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ద్వారా జూలీకి గుర్తింపు రాగా, ఆమెతో రాజకీయంగా విజయ్ కి విభేదాలు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ పై బుల్లితెర నటి జూలీ సంచలన ఆరోపణలు చేసింది. విజయ్ వల్ల తన కడుపులో ఉన్న బిడ్డను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ద్వారా జూలీకి గుర్తింపు రాగా, ఆమెతో రాజకీయంగా విజయ్ కి విభేదాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో విజయ్‌ని విమర్శిస్తూ జూలీ ప్రచారం చేసింది. చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద అనుమతి లేకుండా విజయ్ కి వ్యతిరేకంగా నిరసన చేపట్టి వివాదంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు ఆమెపై భారీగా ట్రోలింగ్‌కు పాల్పడ్డారు.
ఆ ట్రోలింగ్ వల్ల తాను తీవ్ర మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని జూలీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం తనపై రూ.15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు చేసి, ఏదో ఒక కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నిరంతరం ట్రోలింగ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయి తనకు గర్భస్రావం జరిగిందని తెలిపింది. ప్రత్యక్షంగా విజయ్ ప్రమేయం లేకపోయినా పరోక్షంగా అయినా ఆయన హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది. తనను దారుణంగా ట్రోల్ చేస్తున్న అభిమానులు, కార్యకర్తలకు విజయ్ ఒక్కమాట చెప్పి అదుపుచేసి ఉంటే బిడ్డను కోల్పోయేదాన్ని కాదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.






