- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hariteja: అదిరిపోయే క్యాప్షనిచ్చి.. లేటెస్ట్ ఫొటోలు పంచుకున్న నటి హరితేజ..!!
యాంకర్, నటి హరితేజ(Hariteja) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్, నటి హరితేజ(Hariteja) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రల్లో నటించి.. బుల్లితెర ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. తన అద్భుతమైన నటనకు జనాలు ఫిదా అయిపోయారనడంలో అతిశయోక్తిలేదు. తర్వాత ఈమె పలు కార్యక్రమాల్లో యాంకర్ గా అవకాశాలు దక్కించుకుంది. బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ -1 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో తనదైన టాలెంట్‌తో బిగ్‌బాస్ ప్రేక్షకుల్ని అలరించింది.
ఓటింగ్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ దూసుకుపోయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్‌కు హరితేజ టైటిల్ విన్నర్ కాలేకపోయింది. కానీ మూడవ స్థానంలో నిలబడి.. గౌరవంగా బయటకొచ్చింది. అంతేకాకుండా ఈ కంటెస్టెంట్ రీసెంట్‌గా కంప్లీట్ అయిన బిగ్ బాస్ సీజన్-8 లో కూడా మళ్లీ వైల్డ్ కార్డు (wild card)ఎంట్రీ ఇచ్చి.. మరోసారి బిగ్‌బాస్ ప్రేక్షకుల్ని అలరించింది.
కానీ మొదటి సీజన్‌లో లాగా హరితేజ జనాల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ సీజన్‌లోలాగా అంతగా ఫైర్ కనిపించలేదు. ఈ విషయాన్ని హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున (Nagarjuna) కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన కొన్ని వీక్స్‌లోనే ఈ నటి ఎలిమినేట్ అయ్యింది. బయటికొచ్చినాక కూడా హరితేజ ఎక్కువగా కనిపించలేదు. అప్పుడప్పుడు కనిపించే స్టార్ మా షోలల్లో కూడా కనిపించలేదు.
తాజాగా హరితేజ తన పుట్టిన రోజు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. స్కై బ్లూ కలర్ శారీ.. స్లివ్‌లెస్ బ్లౌజ్ ధరించి స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిచ్చింది. చీరలో అందాలు ఆరబోస్తోన్న పిక్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ గ్లామర్ పిక్స్‌కు హరితేజ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘ఏమంటున్న మదనుడు.. తెగ ప్రేమించాక వదలడు’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






