హీరోయిన్ బరువుపై ట్రోలింగ్‌...చెత్త ప్రశ్నలు అంటూ సీరియ‌స్!

by velandi.Saikiran |   (  Updated:2025-11-07 02:19:02  IST  )

హీరోయిన్ గౌరీ కిషన్ ( Actress Gowri Kishan) గురించి తెలియని వారు ఉండరు

హీరోయిన్ బరువుపై ట్రోలింగ్‌...చెత్త ప్రశ్నలు అంటూ సీరియ‌స్!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: హీరోయిన్ గౌరీ కిషన్ ( Actress Gowri Kishan) గురించి తెలియని వారు ఉండరు. ఈ బ్యూటీ 96 అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇటు తెలుగులో 2020లో వచ్చిన జాను సినిమాతో మెరిసారు. శ్రీదేవి శోభన్ బాబు సినిమాలో హీరోయిన్ గా కూడా చేశారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు గౌరీ కిషన్. అయితే ఈ తమిళ హీరోయిన్ గౌరీ కిషన్ కు ఘోర అవమానం జరిగింది.

ఆమె బాడీ షేమింగ్ కు గురయ్యారు. తాను నటించిన ఓ మూవీ ప్రమోషన్ లో భాగంగా దర్శకుడితో కలిసి చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు హీరోయిన్ గౌరీ కిషన్. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన జర్నలిస్టు రెచ్చిపోయి ప్రశ్నలు అడిగారు. జనాలందరి ముందే మీ బరువు ఎంత ? అంటూ హీరోయిన్ పరువు తీసే ప్రయత్నం చేశాడు.

ఇక ఆ ప్రశ్న వినగానే వెంటనే రియాక్ట్ అయ్యారు హీరోయిన్ గౌరీ కిషన్. ఈ సినిమాకు నా బరువుకు ఏంటి సంబంధం ? చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు ? అంటూ ఫైర్ అయ్యారు. ప్రతి మహిళకు ఒక బరువు ఉంటుంది.. వాటి విషయాలు ఎందుకు స్టుపిడ్ క్వశ్చన్ అంటూ ఆమె సీరియస్ అయ్యారు. దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. క్లిక్

Next Story