సింగర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి.. విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండాలంటూ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

సింగర్ మికా సింగ్(Mika Singh) నిర్మాతగా మారి బిపాసా బసు(Bipasha Basu), కరణ్ గ్రోవర్(Karan Grover) దంపతులను పెట్టి ‘డేంజరస్’ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు.

సింగర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి.. విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండాలంటూ  షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: సింగర్ మికా సింగ్(Mika Singh) నిర్మాతగా మారి బిపాసా బసు(Bipasha Basu), కరణ్ గ్రోవర్(Karan Grover) దంపతులను పెట్టి ‘డేంజరస్’ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. అయితే దీనికి భూషణ్ పటేల్(Bhushan Patel) దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ 2022లో వచ్చి మంచి పేరు సంపాదించుకోలేకపోయింది. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మికా సింగ్ ‘‘ఈ సిరీస్‌కు నేను రూ. 14 కోట్లకు పైకా డబ్బులు ఖర్చు చేశాను కానీ లాభాలు రాలేదు. మారి ‘డేంజరస్’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఓ ఇద్దరు నాటకాలాడటం వల్ల షూట్ వాయిదా వేశాం. అయితే నిజ జీవితంలో భార్యాభర్తలు కాబట్టి ముద్దు సన్నివేశాల్లో చేస్తారని అనుకున్నాం. కానీ వారు అవన్నీ చేయలేమని కండీషన్స్ పెట్టారు. వాళ్ల ప్రవర్తన చూశాక అసలు నేను నిర్మాతను ఎందుకయ్యానా అనిపించింది.

ఆ ఇద్దరినే కాదు ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలు చాలా మంది నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారు. నిజానికి వాళ్ళు మమ్మల్ని దేవుళ్లుగా భావించాలి.. కానీ అలా జరగడం లేదు. దేవుడు ఉన్నాడు.. మనం చేసే పనులన్నీ చూస్తుంటాడని నేను నమ్ముతాను. వాళ్లు నాకు చేసిన మోసానికి తెచ్చిన నష్టాలకు ఈ నాడు ఆ దంపుతులకు ఏ పనీ లేకుండా పోయింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మికా సింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, బిపాసా బసు ఈ కామెంట్స్‌పై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ‘‘విషపూరితమైన స్వభావం కలిగిన వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తారు. తప్పు ఏదైనా సరే నిందలు మాత్రం ఎదుటి వ్యక్తుల మీదే వేస్తారు. ఆ తప్పునకు బాధ్యత మాత్రం వహించరు. అలాంటి వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపైనా ఉండాలి దుర్గా దుర్గా’’ అనే కొటేషన్ షేర్ చేసి మీకా సింగ్‌కు ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చింది. అలాగే దండం పెట్టే ఫొటోలు కూడా పోస్టులో జత చేసింది.

Next Story