- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dhanya Balakrishna: IAS, IPS అవ్వడం ఈజీ కానీ.. సినిమాలు అంటే కష్టం.. వైరల్‌గా నటి కామెంట్స్
సీనియర్ నటీనటులు బ్రహ్మాజీ (Brahmaji), ఆమని (Amani) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాపు’ (Bapu).

దిశ, సినిమా: సీనియర్ నటీనటులు బ్రహ్మాజీ (Brahmaji), ఆమని (Amani) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాపు’ (Bapu). ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ మూవీని నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు దయా తెరకెక్కిస్తున్నాడు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో బలగం సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy), అవసరాల శ్రీనివాస్ (Avrasala Srinivas), ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా ప్రీ రిలీజ్ (pre-release) ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా నటి ధన్య బాలకృష్ణ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘‘బాపు’ అనే సినిమా నా కెరీర్‌లో, నా లైఫ్‌లో మర్చిపోలేని ప్రాజెక్ట్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నా బాపు నాకు ఫోన్ చేసి ‘ఈ సినిమా నువ్వు సెలక్ట్ చేసుకున్నందుకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను’ అన్నారు. అలాంటి మాటలు నిజంగా చాలా రేర్‌గా వినిపిస్తాయి. మనం కమర్షియల్‌గా, గ్లామరస్‌గా చేసే సినిమాలు పక్కన పెడితే పల్లే టూరు సినిమా చేయాలి అని ఉండేది. సిటీ అనేది ఒక శరీరం అయితే పల్లెటూరు దాని సోల్. అందుకే ప్రతి యాక్టర్ ఒక పల్లెటూరు కథ చెయ్యాలి. అప్పుడే నువ్వు ఒక ఇండియన్ యాక్టర్ అవుతావు.. లేకుంటే కాదు అని చెప్పేవారు మా బాపు. ఫస్ట్ నేను మా బాపుకి థాంక్యూ చెప్పుకోవాలి. నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక అమ్మాయి సినిమా ఫీల్డ్ ఎంచుకోవడం అనేది వేరీ టఫ్. మేము IAS, IPS కూడా తలుచుకుంటే ఈజీగా అవ్వొచ్చు. కానీ యాక్టర్ అవ్వాలంటే అమ్మానాన్నలను, చుట్టుపక్కల వాళ్లను, బంధువులను ఒప్పించడం చాలా కష్టం. అలా నేను పది సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వచ్చి వేరే ఊర్లకు షూటింగ్‌కు వెళ్లినప్పుడు మా నాన్నకు చాలా భయం ఉండే. నైట్ ట్రావలింగ్, షూటింగ్స్‌లో ఉన్నప్పుడు కాల్ చేసి.. అంతా ఓకేనా సేఫ్‌గా ఉన్నావా అని అడిగేవారు కానీ ఎప్పుడు ఇదంతా ఎందుకు ఆపేయ్ అని చెప్పలేదు. కానీ, ప్రతీ రోజు ఒక మెసేజ్ లేదా కాల్ చేసి ఓకేనా అని అంటారు అంతే’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ధన్య బాలకృష్ణ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






