- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
30 లక్షల మందిని బ్లాక్ చేశా : నటి సంచలన వ్యాఖ్యలు
by Muthe.Rajitha |
సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా మాట్లాడిన వారిని ఇప్పటివరకు 30 లక్షల మందిని బ్లాక్ చేసి పడేశానని నటి అనసూయ(Actor Anasuya) సంచలన వ్యాఖ్యలు చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా మాట్లాడిన వారిని ఇప్పటివరకు 30 లక్షల మందిని బ్లాక్ చేసి పడేశానని నటి అనసూయ(Actor Anasuya) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎవరైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే, ఎవ్వరైనా సరే వాళ్ళని బ్లాక్ చేస్తానని కుండబద్దలు కొట్టింది. చాలాసార్లు నెగెటివ్ కామెంట్స్ భరించలేక పోయేదాన్నిఅని, కొన్నిటికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చినప్పటికీ, కొంతమందిని భరించలేకపోయానని చెప్పుకొచ్చింది.
అలాంటి వాళ్లు నా ప్రపంచంలో లేకపోయినా పెద్దగ పోయేదేమీ లేదని బ్లాక్ చేశానని, అలా ఇప్పటి వరకు 3 మిలియన్ల మందిని బ్లాక్ చేసినట్టు పేర్కొన్నారు. అయితే నెటిజన్స్ ఎప్పటిలాగే అనసూయ ఈ కామెంట్స్ పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు.
Next Story






