- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెట్టింట ఐశ్వర్యరాయ్ అశ్లీల వీడియోలు వైరల్..
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ని చూస్తే ఆమె అందానికి దాసోహం కానివాళ్లు ఉండరు. ముఖ్యంగా ఆమె కళ్ల సొగసుకు ఆగ, మగ అనే తేడా లేకుండా పడిపోవాల్సిందే.

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ని చూస్తే ఆమె అందానికి దాసోహం కానివాళ్లు ఉండరు. ముఖ్యంగా ఆమె కళ్ల సొగసుకు ఆగ, మగ అనే తేడా లేకుండా పడిపోవాల్సిందే. ఆ అందామే ఇప్పుడు ఆమెకు ముప్పు తెచ్చిపెడుతుండనంలో సందేహం లేదు. 50 ఏళ్ల వయసు దాటినా ఐశ్వర్య అందానికి నేటి యువత ఇంకా ఫిదా అవుతూనే ఉన్నారు. ఈక్రమంలోనే కొందరు ఐశ్వర్య రాయ్ అనుమతి లేకుండా టీ షర్ట్‌లపై ఆమె ఫొటోలను వాడుతూ బిజినెస్ చేస్తున్నారు. అంతే కాదు.. ఐశ్వర్య ఫొటోలను అశ్లీలంగా మార్పింగ్ చేసి న్యూడ్ వీడియోలు, నగ్నంగా యానిమేషన్ చిత్రాలు తయారు చేస్తున్నారని ఇవాళ ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించింది.
ఐశ్వర్య రాయ్ తరుఫుల సీనియర్ అడ్వకేట్ సందీప్ సేథీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఐశ్వర్యరాయ్‌కి చెందిన పూర్తిగా అసత్యమైన అశ్లీల ఫొటోలు, వీడియోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఐశ్వర్య ఫొటోలను, పేరును వాడుతూ ఏఐ ఆధారంగా న్యూడ్ వీడియోలు, ఫొటోలను తయారి చేసి ఇంటర్ నెట్‌లో పెట్టారని, దీని వల్ల ఆమె పేరు, ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందని వెల్లడించారు. అంతేకాదు.. ఐశ్వర్య అనుమతి లేకుండా ఆమె ఫొటోలను వాడుతూ టీ షర్టులను ముద్రిస్తున్నారని వివరించారు. ఐశ్వర్య రాయ్ చిత్రాలను వారి ఇష్టానూసారంగా మార్పింగ్ చేస్తున్నారని, వెంటనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. యూట్యూబ్‌లలో పెట్టిన ఐశ్వర్యరాయ్ అశ్లీల వీడియోలు, ఫొటోలకు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టుకు అందించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జనవరి 15వ తేదీకి వాయిదా వేసింది.






