- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ఇండస్ట్రీలోని నటీనటులు నిర్మాతలను చాలా ఇబ్బంది పెడుతున్నారు.. సింగర్ సంచలన వ్యాఖ్యలు
సింగర్ మికా సింగ్(Mika Singh) నిర్మాతగా మారి ‘డేంజరస్’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.

దిశ, సినిమా: సింగర్ మికా సింగ్(Mika Singh) నిర్మాతగా మారి ‘డేంజరస్’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. అయితే ఇందులో బిపాసా బసు(Bipasha Basu), కరణ్ గ్రోవర్(Karan Grover) ప్రధాన పాత్రలో నటించగా.. దీనికి భూషణ్ పటేల్(Bhushan Patel) దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్ 2022లో వచ్చి మంచి పేరు సంపాదించుకోలేకపోయింది. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, మికా సింగ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన తాను నిర్మాతగా నష్టాలు ఎదుర్కోవడానికి కారణం ఓ జంట అని తెలుపుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ఈ సిరీస్‌కు నేను రూ. 14 కోట్లకు పైకా డబ్బులు ఖర్చు చేశాను కానీ లాభాలు రాలేదు.
ఓ ఇద్దరు నాటకాలాడటం వల్ల షూట్ వాయిదా వేశాం. అయితే నిజ జీవితంలో భార్యాభర్తలు కాబట్టి ముద్దు సన్నివేశాల్లో చేస్తారని అనుకున్నాం. కానీ వారు అవన్నీ చేయలేమని కండీషన్స్ పెట్టారు. వాళ్ల ప్రవర్తన చూశాన అసలు నేను నిర్మాతను ఎందుకయ్యానా అనిపించింది. ఆ ఇద్దరనే కాదు ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలు చాలా మంది నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారు. నిజానికి వాళ్లు మమ్మల్ని దేవుళ్లుగా భావించాలి.. కానీ అలా జరగడం లేదు. దేవుడు ఉన్నాడు.. మనం చేసే పనులన్నీ చూస్తుంటాడని నేను నమ్ముతాను. వాల్లు నాకు చేసిన మోసానికి తెచ్చిన నష్టాలకు ఈ నాడు ఆ దంపుతులకు ఏ పనీ లేకుండా పోయింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మికా సింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక వాటిని ఆయన అందరినీ ఉద్దేశించి చేయడంతో నెటిజన్లలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.






