- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నటుడు శుభలేఖ సుధాకర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ కలిశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15న రవీంద్ర భారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. రవీంద్రభారతి ఆవరణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతించినందుకు ఎస్పీ బాలు కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు డిసెంబర్ 15 న విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా సీఎంని కోరారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నటుడికి శాలువా కప్పి సత్కరించారు. కాగా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ప్రాంగణంలో ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పక్కన ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక, గాన గంధర్వుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు. ఆయన 2020 సెప్టెంబర్ 25న అనారోగ్యంతో కన్నుమూశారు.






