- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టిస్టులను చూసి జనాలు థియేటర్స్‌కు రావడం ఎప్పుడో మానేశారు.. నటుడు షాకింగ్ కామెంట్స్
ఆర్టిస్టులను చూసి ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం ఎప్పుడో మానేశారు అంటూ నటుడు సప్తగిరి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

దిశ, సినిమా: మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే 8న రాబోతుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఈ సినిమాలో నటిస్తున్న సప్తగిరి కొన్ని అసక్తిక కామెంట్స్ చేశాడు. ‘ఓపెన్‌గా చెప్పాలంటే ఇప్పుడు థియేటర్ల పరిస్థితి అంతగా బాలేదు. జనాలు థియేటర్స్‌కు రావడం లేదు. ఆర్టిస్టులను చూసి జనాలు థియేటర్స్‌కు వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. ఒక డైరెక్టర్ అద్భుతమైన స్టోరీ అని చెప్పి, ఆ డైరెక్టర్ సినిమా బలే తీశాడురా, ఎక్స్‌టార్డినరీ చిత్రం అనే మౌత్ టాక్ బయటకు వెళ్లగలిగితే అప్పుడు జనాలు నమ్మి థియేటర్స్ లోపలికి వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఆ ఆర్టిస్టు ఉన్నాడు, ఈ ఆర్టిస్టు ఉన్నాడు అని వచ్చే రోజులు పోయాయి. అయితే.. ఒక స్థాయి ఆర్టిస్టుల వరకు థియేటర్స్‌లో ఓపెనింగ్స్ గ్రాండ్‌గా ఉంటాయి. కానీ ఇలాంటి సినిమాలకు మాత్రం డైరెక్టర్ స్టోరీనే నమ్మాలి. డైరెక్టర్ అద్భుతమైన స్టోరీ ఇచ్చాడు అని మేమంతా నమ్మాము. మీరు కూడా నమ్మి ఈ సినిమాకు మంచి సక్సెస్ ఇస్తారు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము’ అని చెప్పుకొచ్చాడు.






