boycottlaila : సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసిన నటుడు పృధ్వీరాజ్

by Muthe.Rajitha |

"లైలా" చిత్ర వివాదం(Laila Movie Issue)లో ఇరుకున్న నటుడు పృధ్వీరాజ్(Actor Prudhviraj) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

boycottlaila : సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసిన నటుడు పృధ్వీరాజ్
X

దిశ, వెబ్ డెస్క్ : "లైలా" చిత్ర వివాదం(Laila Movie Issue)లో ఇరుకున్న నటుడు పృధ్వీరాజ్(Actor Prudhviraj) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను వైసీపీ సోషల్ మీడియా విభాగం(YCP Social Media Wing) వేధింపులకు గురి చేస్తోందంటూ బుధవారం హైదరాబాద్ లోని సైబర్ క్రైం(Cyber Crime) పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో మెసేజెస్, చంపేస్తామని బెదిరంపు కాల్స్ తో తనను మానసికంగా వేధిస్తున్నారని పృధ్వీ ఫిర్యాదులో వెల్లడించారు. ఫిర్యాదు అనంతరం పృధ్వీ మీడియాతో మాట్లాడుతూ.. నా నెంబర్ ను సోషల్ మీడియాలో పెట్టి, 2 వేల ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని.. తన ఇంట్లో వాళ్ళని అసభ్యంగా తిట్టారని అన్నారు. దాంతో తాను తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు. త్వరలోనే ఏపీ డిప్యూటీ సీఎంను, హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని.. నన్ను వేధించిన ప్రతి ఒక్కరిపై కోటి రూపాయల నష్ట పరిహారం పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు.

విడుదలకు సిద్ధంగా ఉన్న విశ్వక్ సేన్(Vishvaksen) "లైలా"(Laila) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృధ్వీరాజ్(Actor Prudhviraj) చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దూమరాన్ని రేపాయి. పృధ్వీ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీని ఉద్దేశించే అని వైసీపీ(YCP) వర్గీయులు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ లైలా(boycottliala) అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా ఫిబ్రవరి 14న విడుదల అవనున్న ఈ సినిమా HD ప్రింట్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై విశ్వక్ సేన్, నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ అడిగిన తర్వాత కూడా ట్రోలింగ్ ఆగలేదు. పృధ్వీకి అసంఖ్యాక బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

అయితే సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడిగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ గతంలో వైసీపీ(YCP)కి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. దీంతో వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేసి జనసేన(Janasena)కు దగ్గరైన పృథ్వీరాజ్ మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశారు. ఇక ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా ఫంక్షన్ లో అయినా సరే వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న ఆయన తాజాగా లైలా ఈవెంట్లో వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు.

Next Story