Prakash Raj : బాలీవుడ్ అమ్ముడు పోయింది : మరో బాంబ్ పేల్చిన నటుడు ప్రకాష్ రాజ్

by Muthe.Rajitha |

ఎలాంటి విషయాలనైనా సూటిగా కుండ బద్ధలు కొట్టే నటుడు ప్రకాష్ రాజ్(Actor Prakash Raj) మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు.

Prakash Raj : బాలీవుడ్ అమ్ముడు పోయింది : మరో బాంబ్ పేల్చిన నటుడు ప్రకాష్ రాజ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎలాంటి విషయాలనైనా సూటిగా కుండ బద్ధలు కొట్టే నటుడు ప్రకాష్ రాజ్(Actor Prakash Raj) మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్(Bollywood) అమ్ముడు పోయిందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమరాన్ని రేపుతున్నాయి. ఏదైనా విషయంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది నటీనటులపైనే ఆధారపడి ఉంటుందని... అయితే దురదృష్టవశాత్తూ వారిలో సగం మంది అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. అయితే ఆ ఇంటర్వ్యూలో తనలాగా బాలీవుడ్ యాక్టర్స్ స్పందించకపోవడం మీద చర్చ నడుస్తుండగా.. బాలీవుడ్‌లో చాలా మంది నటులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా భయపడుతున్నారని చెప్పారు. కొందరు నటులు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడానికి ధైర్యం చేయరని, ఎందుకంటే వాళ్లు రాజకీయ పార్టీల ప్రభావంలో ఉన్నారని, సూటిగా చెప్పాలి అంటే వారు అమ్ముడు పోయారని ఆయన ఆరోపించారు.

కొంతమంది యాక్టర్స్ తమ స్వేచ్ఛను కోల్పోయి, రాజకీయ అజెండాలకు తలొగ్గి, వెన్నుముఖ కోల్పోయి బతుకుతారని సంచలన కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు ఆయన మాటల్ని సమర్థిస్తే, మరికొందరు ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తప్పని విమర్శించారు. గతంలోనూ ప్రకాష్ రాజ్ సనాతన ధర్మం, రాజకీయ నాయకులపై వివాదాస్పద కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి బాలీవుడ్‌పై ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.

Next Story