లాబీయింగ్ చేస్తేనే అవార్డులు : ప్రకాష్ రాజ్

by Muthe.Rajitha |

విలక్షణ నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.

లాబీయింగ్ చేస్తేనే అవార్డులు : ప్రకాష్ రాజ్
X

దిశ, వెబ్ డెస్క్ : విలక్షణ నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. లాబీయింగ్ చేస్తేనే అవార్డులు వస్తాయని సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. కాగా సోమవారం కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన జరిగిన సంగతి తెలిసిందే. అయితే కేరళ జ్యూరీలో ఛైర్మన్ గా ఉన్న ప్రకాష్ రాజ్.. అవార్డుల ప్రకటన అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.

మమ్ముట్టి లాంటి గొప్ప నటుడికి జాతీయస్థాయి గుర్తింపు రాకపోవడం విచారకరం అని, ప్రస్తుతం అవార్డులన్నీ లాబీయింగ్ వల్లే వస్తున్నాయని, మమ్ముట్టికి అలంటి అవార్డు అవసరం లేదని అభిప్రాయపడుతున్నట్టు పేర్కొన్నారు. కేరళ జ్యూరీలో చైర్మన్ గా తనకు స్వేచ్చ ఇస్తామని చెప్పి, తరువాత అవార్డుల విషయంలో సభ్యులు జోక్యం చేసుకున్నారని ప్రకాష్ రాజ్ మాట్లాడటం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Next Story