48 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Mallepaka Hamsa |

గత కొద్ది రోజుల నుంచి సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు చేసుకుంటూ పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెడుతున్నారు.

48 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు చేసుకుంటూ పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెడుతున్నారు. కొంతమంది మాత్రం తమ స్నేహితులతోనే పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరికొందరు మాత్రం సీక్రెట్‌గా వివాహం చేసుకుని కొన్ని రోజుల తర్వాత అనౌన్స్ చేస్తున్నారు. ఇటీవల కీర్తి సురేష్(Keerthy Suresh) తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తటిల్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే అసలు పెళ్లే వద్దు అన్న పుష్ప నటుడు డాలి ధనుంజయ్(Dhananjay) కూడా ఓ డాక్టరమ్మతో ఏడడుగులు వేయనున్నారు. ఇక అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభితను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా, బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్(Sahil Khan) 48 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఫిబ్రవరి 9న అతని ప్రియురాలు మిలేనా అలెగ్జాండ్‌ను (21) వివాహం చేసుకున్నాడు. అయితే దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో ఈ వేడుక జరిగింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ సాహిల్‌ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘ఫైనల్లీ నేను నా బేబీని పెళ్లి చేసుకున్నాను’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన కొందరు కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే మరికొందరు ఏంజెల్‌లా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సాహిల్ భార్య గురించి సోషల్ మీడియాలో సెర్చింగ్ మొదలెట్టారు. దీంతో ఆమె సాహిల్ కంటే 26 ఏళ్ల చిన్నది అని తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. అసలు అంత అందంగా ఉన్న ఆమె 48 ఏళ్ల అతడిని ఎలా పెళ్లి చేసుకుందో అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story