నటనకు 4 ఏళ్లు బ్రేక్ ఇచ్చి పొటాటో-పప్పుల రేట్లు తెలుసుకోవాలనుకున్నా.. ఆశ్చర్యపరుస్తోన్న నటుడి కామెంట్స్

by Kodari Anjali |

సిని ప్రేక్షకులకు పరిచయమున్న సీనియర్ నటుడు మాధవన్ (Madhavan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

నటనకు 4 ఏళ్లు బ్రేక్ ఇచ్చి పొటాటో-పప్పుల రేట్లు తెలుసుకోవాలనుకున్నా.. ఆశ్చర్యపరుస్తోన్న నటుడి కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సిని ప్రేక్షకులకు పరిచయమున్న సీనియర్ నటుడు మాధవన్ (Madhavan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాలుగు సంవత్సరాలు సినిమాలు బ్రేక్ ఇచ్చిన మాధవన్ తాజాగా చేసిన కామెంట్స్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ముందుగా మూవీస్ గురించి మాట్లాడారు. రొటీన్‌కు డిఫరెంట్‌గా నటించడం అంటే.. అలాంటి పాత్రలు పోషించడమంటే ఇష్టమని తెలిపారు.

నేను అనుకున్నట్లే అలాంటి మంచి పాత్రల్లో అవకాశాలు వచ్చినందుకు హ్యాపీగా ఉందని అన్నారు. కానీ సమ్ టైమ్స్ అస్సలు సమయమే దొరకకా తరచూ వర్క్ మీదే ఉండాల్సి వస్తే.. విసుగు పుట్టేదని వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లో ఓ పాట చిత్రీకరించేటప్పుడు బయట ఓ పర్సన్ నన్ను చూసి నవ్వారని.. కానీ కాస్ట్యూమ్స్ కారణంగా అలా ఉన్నానని అనుకున్నానని తెలిపారు.

అలాగే పప్పులు, పొటాటో వంటి కూరగాయల ధరలు... అలాగే సొసైటీలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని నాలుగేళ్లు బ్రేక్ తీసుకున్నానని మాధవన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రిక్షా నడిపేవాళ్లు ఎలా మాట్లాడుతారు? జనాలు వేటిని అధికంగా ఇష్టపడుతున్నారు? ఇలాంటి విషయాల పట్ల ఆసక్తి చూపానని పేర్కొన్నారు. మూవీసే కాదు.. వాణిజ్య ప్రకటనలకూ దూరంగా ఉన్నానని అన్నారు. గడ్డం పెంచి దేశం మొత్తం తిరిగానని.. సైకాలజీ అర్థం చేసుకునేందుకు ఇది మంచి చాన్స్ అని భావించానని అన్నారు. ప్రస్తుతం నటుడు మాధవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story