- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి చనిపోయినవేళ టాలీవుడ్ నటుడు ఎమోషనల్ పోస్ట్.. నెట్టింట వైరల్
తండ్రి చనిపోయినవేళ టాలీవుడ్ నటుడు జోష్ రవి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. గతవారం రవి తండ్రి గుండెపోటుతో మరణించగా పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు. కాగా నేడు రవి తన సోషల్ మీడియాలో సినిమాపై ప్రేమను వివరిస్తూ తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: తండ్రి చనిపోయినవేళ టాలీవుడ్ నటుడు జోష్ రవి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. గతవారం రవి తండ్రి గుండెపోటుతో మరణించగా పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు. కాగా నేడు రవి తన సోషల్ మీడియాలో సినిమాపై ప్రేమను వివరిస్తూ తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. తన పోస్ట్‌లో.. సినిమా అనేది నీకు సరదా నాకు బతుకుదెరువు. సినిమా అనేది నాకు సెంటిమెంట్ నీకు జస్ట్ ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది నీకు వీకెండ్.. అదే నాకు టిల్ మై ఎండ్. నువ్వు కష్టాలు మర్చిపోవడానికి థియేటర్ కు వస్తావ్.. నేను తండ్రి చనిపోయినా ఆ కష్టాన్ని గొంతులో దాచుకుని నిన్ను నవ్విస్తాను. నీకు బాధ కలిగితే ఏడుస్తావ్.. అదే నాకు బాధ కలిగితే సినిమా చూస్తా.. అంటూ అందులో రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే రవి జోష్ సినిమాతో నటుడిగా పరిచయమై అనేక సినిమాల్లో నటించాడు. జబర్దస్ట్ కంటెస్టెంట్ గా సైతం రాణించాడు. చిరంజీవి వాయిస్ మిమిక్రీ చేస్తూ అచ్చం ఆయన బాడీ లాంగ్వేజ్ ను కాపీ కొడుతూ రవి ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ రవికి ఆశించినమేర సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి.






