హీరోయిన్ దిశా పటాని సోదరి గొప్ప మనసు... వీడియో వైరల్

by velandi.Saikiran |

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ( Disha Patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు తెలుగు అటు హిందీ...

హీరోయిన్ దిశా పటాని సోదరి గొప్ప మనసు... వీడియో వైరల్
X

దిశ , వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ( Disha Patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు తెలుగు అటు హిందీ... ఎక్కడ అవకాశం దొరికినా... వదులుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అయితే అలాంటి హీరోయిన్ దిశా పటాని సోదరి కుష్బూ పటాని ( Khushboo Patani) మంచి మనసు చాటుకున్నారు. ఓ చిన్నారి ప్రాణాలను హీరోయిన్ దిశా పటాని సోదరి కుష్బూ కాపాడారు. ఈ సంఘటన ఆదివారం జరగగా... తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని (UP) బరేలిలో ఓ ఇంటి సమీపంలో హీరోయిన్ దిశా పటాని... సోదరి కుష్బూ వాకింగ్ చేస్తున్నారు. అదే సమయంలో వాకింగ్ చేసే ప్రదేశంలో ఓ చిన్నారి ఏడుపు.... దిశా పటాని సోదరికి వినిపించింది. చిన్నారి ఏడిస్తే ఎవరు ఊరుకుంటారు... అచ్చం హీరోయిన్ సోదరి కుష్బూ ( Khushboo Patani ) అలాగే చేసింది. ఆ చిన్నారి బాధ ఏంటో తెలుసుకుందామని... అన్వేషించింది. వెంటనే ఆ చిన్నారి ఏడ్చే.. ప్రదేశానికి వెళ్లి.. రక్షించింది. అక్కడ ఒక్కతే చిన్నారి.. ఏడుస్తూ ఉందట.

కన్నతల్లి ఆమెను వదిలి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారిని వదిలి వెళ్ళిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది కుష్బూ. ఆ తర్వాత శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది హీరోయిన్ సోదరి కుష్బూ. అనంతరం ఆ చిన్నారిని వాళ్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన సినీ ప్రముఖులు అలాగే... నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరోయిన్ దిశా పటాని సోదరి కుష్బూ మంచి పని చేశారని.. కొనియాడుతున్నారు.

Next Story