మా డాడీ ఫుల్ సంపాదించిండు తిని పడుకుంటా.. మరోసారి యాటిట్యూడ్ స్టార్ హాట్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఈ మధ్య చాలా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తే అనే సినిమాలో హీరోగా నటించగా రీసెంట్ గా సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది.

మా డాడీ ఫుల్ సంపాదించిండు తిని పడుకుంటా.. మరోసారి యాటిట్యూడ్ స్టార్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఈ మధ్య చాలా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తే అనే సినిమాలో హీరోగా నటించగా రీసెంట్ గా సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో చంద్రహాస్ బూతుల లిరిక్స్ తో ఉన్న ఓ పాటను స్టేజిపై పాడాడు. గతంలో చంద్రహాస్ చేష్టలు చూసి యాటిట్యూడ్ స్టార్ అంటూ సోషల్ మీడియా బిరుదు ఇవ్వగా బూతు పాటతో అతడిపై నెక్స్ట్ లెవల్ లో ట్రోలింగ్ మొదలైంది. అంతే కాకుండా రెండు కేసులు కూడా నమోదయ్యాయి.

ఓ జర్నలిస్ట్ చంద్రహాస్ చేసిన పాటపై వీడియో చేయగా అతడికి వార్నింగ్ ఇవ్వడంతో ఓ కేసు నమోదవ్వగా, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. అయినప్పటికీ చంద్రహాస్ యాటిట్యూడ్ మాత్రం తగ్గలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకవేళ నటుడు అవ్వకపోయి ఉంటే ఏం అయ్యేవాడివి అంటూ యాంకర్ ప్రశ్నించగా... మా నాన్న ఫుల్లుగా సంపాదించాడు కాబట్టి తిని పడుకునేవాడిని అంటూ సమాధానం ఇచ్చాడు. ఏమీ అవ్వనని చెప్పాడు.

Next Story