- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మై విలేజ్ షో' లో చీలిక.. వైదొలిగిన అనిల్ జీలా !
మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ నటుడు అనిల్ జీలా నుండి తప్పుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబ్ ద్వారా చాలా మంది సెలబ్రిటీలు అవుతున్న సంగతి తెలిసిందే. మారుమూల గ్రామాలలో వీడియోలు చేసి, యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడమే కాకుండా, కొంత మంది సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అచ్చం అలాగే 'మై విలేజ్ షో ' ( my village show) యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఫేమస్ అయింది అన్న సంగతి తెలిసిందే. తెలంగాణ యాష, భాష ఒట్టి పడేలా 'మై విలేజ్ షో' ఛానెల్ లో వీడియోలు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లంబాడి పల్లె గ్రామానికి చెందిన కొంత మంది యువకులు శ్రీకాంత్, అనిల్ జీలా, శివకృష్ణ ఈ ఛానల్ ఏర్పాటు చేశారు. 2012లో ఈ ఛానల్ ప్రారంభించినప్పటికీ, 2018లో చాలా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ ఛానల్ 3.14 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఛానల్ కు మంచి ఆదరణ కూడా వస్తోంది.
మై విలేజ్ షో లో చీలిక
అద్భుతంగా నడుస్తున్న 'మై విలేజ్ షో" లో చీలిక ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి అధికారికంగా అనిల్ జీలా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానల్ బృందం.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరి ప్రకటించింది. ఇక నుంచి అనిల్ కు తమ ఛానల్ కు ఎలాంటి సంబంధం ఉండబోదని వెల్లడించింది మై విలేజ్ షో టీమ్. ఇప్పటికే అనిల్ జీలా యూట్యూబ్ ఛానల్ సొంతంగా నడిపించుకుంటున్నాడు. సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు.
ఈ తరుణంలోనే 'మై విలేజ్ షో' బృందానికి, అనిల్ కు ( anil geela ) గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి అనిల్ వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మై విలేజ్ షో కూడా అధికారిక ప్రకటన చేసింది. ఇకపై అనిల్ జీలా చేసే ప్రమోషన్లు, ఆయన వ్యాపారాలకు 'మై విలేజ్ షో' కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది టీమ్. 'మై విలేజ్ షో' పేరుతో ఎవరైనా సంప్రదిస్తే, తమ అధికారిక సోషల్ మీడియాల ద్వారా సమాచారం ఇవ్వండి అని పేర్కొంది టీమ్. ఎవరినీ నమ్మ మోసపోకండి అని కోరింది.






