- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన సినిమాలో నటించడంతో నా కల నెరవేరింది.. శార్వరి వాఘ్ ఎమోషనల్ కామెంట్స్
మై వాపస్ ఆవుంగా చిత్రంలో భాగం కావడం నా కెరీర్‌లో ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ గారు దర్శకత్వం వహించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ శార్వరి వాఘ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి వచ్చిన ఆమె ఆ తర్వాత నటిగా కూడా బిగ్ స్క్రీన్‌పై కనిపించి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సెన్సేషనల్ దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రాబోతున్న ‘మై వాపస్ ఆవుంగా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 1947 దేశ విభజన నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ పీరియాడిక్ ప్రేమకథ ఆధారంగా రాబోతుంది. దేశ విభజన సమయంలో తన చిన్ననాటి ప్రేమను కోల్పోయిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకునే ఓ వృద్ధుడి భావోద్వేగ ప్రయాణమే ఈ మూవీ స్టోరీ. ఇందులో దిల్జిత్ దోసాంజ్, యంగ్ హీరో వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్ 12న చిత్రబృందం విడుదల చేయనుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా శార్వరి వాఘ్.. తాజాగా, ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆనందాన్ని పంచుకుంది.
‘‘మై వాపస్ ఆవుంగా చిత్రంలో భాగం కావడం నా కెరీర్‌లో ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ గారు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాల్లో నటించాలని నేను ఎప్పటినుంచో కలలు కనేదాన్ని. ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నాళ్లకు కల నెరవేరినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంతియాజ్ అలీ చిత్రాల్లోని స్త్రీ పాత్రలు ఎంతో ఎమోషనల్‌గా,సంక్లిష్టంగా ఉంటాయి. ఒక రటిగా నా ప్రతిభను నిరూపించుకోవడానికి అలాంటి పాత్రలే కరెక్ట్. ప్రేమ కథలను చూపించడంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది.ఆయన సృష్టించిన ఆ ప్రేమ ప్రపంచంలో నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని ఎప్పుడూ ఆశించేదాన్ని’’ అని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






