జైలర్ 2 షూటింగ్‌లో ప్రమాదం.. ఒకరు మృతి

by Ajay Maddhiboyina |

ర‌జినీకాంత్ హీరోగా న‌టిస్తున్న జైల‌ర్ 2 సినిమా షూటింగ్ లో ప్ర‌మాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం సెట్ వేస్తున్న స‌మ‌యంలో ఆర్ట్ డైరెక్ష‌న్ విభాగంలో ప‌నిచేస్తున్న కార్తికేయ‌న్ అనే వ్య‌క్తికి క‌రెంట్ షాక్ త‌గిలింది. jail

జైలర్ 2 షూటింగ్‌లో ప్రమాదం.. ఒకరు మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: ర‌జినీకాంత్ హీరోగా న‌టిస్తున్న జైల‌ర్ 2 సినిమా షూటింగ్ లో ప్ర‌మాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం సెట్ వేస్తున్న స‌మ‌యంలో ఆర్ట్ డైరెక్ష‌న్ విభాగంలో ప‌నిచేస్తున్న కార్తికేయ‌న్ అనే వ్య‌క్తికి క‌రెంట్ షాక్ త‌గిలింది. ఇంటి సెట్ నిర్మిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. క‌రెంట్ షాక్ తగిలిన వెంట‌నే కార్తికేయ‌న్ కింద‌పడి మ‌ర‌ణించాడు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపై చిత్ర‌యూనిట్ ఇంకా స్పందించ‌లేదు. ఇదిలా ఉంటే నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీకాంత్ హీరోగా వ‌చ్చిన జైల‌ర్ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏకంగా రూ.600 కోట్ల కలెక్ష‌న్లు వ‌చ్చాయి. దానికి సీక్వెల్ గా ఇప్పుడు జైల‌ర్ పార్ట్ 2 తెర‌కెక్కిస్తున్నారు. గ‌తేడాది ఈ సినిమా షూటింగ్ ప‌నులు మొద‌లయ్యాయి. కాగా ఏప్రిల్ లో ఈ సినిమా నుండి క్లిప్ లీక్ అవ్వ‌డం చిత్ర‌యూనిట్ కు షాక్ ఇవ్వ‌గా ఇప్పుడు సెట్ బాయ్ చ‌నిపోవ‌డంతో మ‌రో షాక్ త‌గిలింది.

Next Story