I Want To Talk : ఇకపై ఏ సినిమా కోసం అలాంటి పని చెయ్యను.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఐ వాంట్ టు టాక్’.

I Want To Talk : ఇకపై ఏ సినిమా కోసం అలాంటి పని చెయ్యను.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఐ వాంట్ టు టాక్’(I Want To Talk). రైజింగ్ సన్ ఫిల్మ్స్ అండ్ కినో వర్క్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని సూజిత్ సర్కార్ (Sujith Sarkar) తెరకెక్కించాడు. ఇందులో అభిషేక్‌తో పాటు పెర్లే డే(Pearl Day), అహల్య బాంబ్రూ(Ahalya Bambru), జయంత్ కృపలానీ(Jayant Kripalani), క్రిస్టిన్ గుడార్డ్ అండ్ జానీ లీవర్ లీడ్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇక నవంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అభిషేక్ బచ్చన్.

‘ఇదొక విభిన్నమైన కథ. సూజిత్ ఈ కథ చెప్పగానే ఓకే చేశాను. ఆయనతో పని చేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇందులో నా పాత్రకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతారు. మునుపెన్నడూ లేని విధంగా ఇందులో నా లుక్ ఉంటోంది. ఈ సినిమా కోసం నేను చాలా బరువు పెరిగాను. పొట్టతో కనిపిస్తాను. కానీ ప్రొస్థటిక్ మేకప్ సాయంతో అలా కనిపించానని చాలా మంది అనుకుంటున్నారు. ఇందులో అసలు నిజం లేదు. ఇలా బరువు పెరగడం కోసం చాలా శ్రమించాను. కానీ, ఇకపై ఏ సినిమా కోసం ఆ రిస్క్ తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఈ వయసులో బరువు పెరిగితే మళ్లీ తగ్గడం చాలా కష్టం అవుతుంది’ అని చెప్పుకొచ్చాడు.

Next Story