అవార్డును కొనుక్కున్న మెగాస్టార్ కొడుకు.. ప్రూవ్ చేస్తానని సవాల్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-31 13:41:21  IST  )

మెగాస్టార్, బిగ్ బి అబితాబ్ బచ్చన్ కుమారుడు జూనియర్ బచ్చన్‌గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అభిషేక్ బచ్చన్‌.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోయాడనే అంటారు. కెరీర్ తొలినాళ్లలో మంచి క్యారెక్టర్స్

అవార్డును కొనుక్కున్న మెగాస్టార్ కొడుకు.. ప్రూవ్ చేస్తానని సవాల్..
X

దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్, బిగ్ బి అబితాబ్ బచ్చన్ కుమారుడు జూనియర్ బచ్చన్‌గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అభిషేక్ బచ్చన్‌.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోయాడనే అంటారు. కెరీర్ తొలినాళ్లలో మంచి క్యారెక్టర్స్ పడకపోవడం ఆయనకు మైనస్ అయింది. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్‌ను పెళ్లి చేసుకున్నాక.. ఆమె భర్త అనిపించుకోవడమే సరిపోయింది. కానీ ఈ మధ్య అభిషేక్ సినిమాల ఎంపిక పూర్తిగా మారిపోయింది. చివరగా వచ్చిన ‘ఐ వాంట్ టు టాక్’ సినిమా మనసున్న ప్రతి మనిషి హృదయాన్ని మెలిపెట్టేసి.. కన్నీరు పెట్టిస్తుంది. ఆ చిత్రంలో నటనకే అభిషేక్‌కు ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది. కానీ హీరో అవార్డును కొన్నాడని, పీఆర్ స్టంట్స్ చేస్తున్నాడని.. ఓ వర్గం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది.

దీంతో సూపర్ క్లారిటీతో ఆ పోస్టుకు రిప్లయ్ ఇచ్చాడు అభిషేక్. ‘అవార్డులు కొనడం కానీ అగ్రెసివ్ పీఆర్ స్టంట్స్ చేయడం కానీ ఎప్పుడూ జరగలేదు. హార్డ్ వర్క్, రక్తం, చెమట, కన్నీరుతో మాత్రమే ఇది సాధ్యమైంది. అయితే నీ నోరు మూయించేందుకు మంచి మార్గం మరింత కష్టపడటం.. నా అచీవ్మెంట్‌పై అనుమానపడకుండా ఉండేందుకు ఫ్యూచర్‌లో మరిన్ని సాధించడం. నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేస్తా’ అని సమాధానమిచ్చాడు. దీంతో అభిషేక్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

Next Story