ఘనంగా ప్రారంభమైన అభిషన్ జీవింత్ సినిమా.. ఒక కొత్త కల మొదలైందంటూ ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |

అభిషన్ జీవింత్ సరసన శివానీ నాగరం, యోగలక్ష్మి హీరోయిన్లుగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఘనంగా ప్రారంభమైన అభిషన్ జీవింత్ సినిమా.. ఒక కొత్త కల మొదలైందంటూ  ఆసక్తికర  పోస్ట్
X

దిశ, సినిమా: అభిషన్ జీవింత్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 'విత్ లవ్' చిత్రంతో హీరోగా మారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అభిషన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన హీరోగా తన రెండో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. గౌతమ్ శివరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సరికొత్త చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. డ్రామా కంపెనీ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

ఇందులో అభిషన్ జీవింత్ సరసన శివానీ నాగరం, యోగలక్ష్మి హీరోయిన్లుగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. "ఒక కొత్త కల మొదలైంది.. ఒక కొత్త ప్రయాణం ఆవిష్కృతమవుతోంది. దేవుడి ఆశీస్సులు, మీ అందరి ఆదరణతో మా తొలి ప్రయత్నం పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. ప్రతిభావంతులైన నటీనటులు, అద్భుతమైన సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి మా మొదటి సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది" అని మేకర్స్ రాసుకొచ్చారు.

Next Story