- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kalam Biopic : అబ్దుల్ కలాం బయోపిక్ పోస్టర్ రిలీజ్
భారతదేశ 11వ రాష్ట్రపతి, "మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం(APJ Abdul Kalam) జీవితం ఆధారంగా ఓ బయోపిక్(Biopic) రూపొందుతుంది.

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశ 11వ రాష్ట్రపతి, "మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం(APJ Abdul Kalam) జీవితం ఆధారంగా ఓ బయోపిక్(Biopic) రూపొందుతుంది. "కలాం : ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా"(Kalam: The Missile Man of India) పేరుతో నిర్మితం అవుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ధనుష్(Dhanush) డాక్టర్ కలాం పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను నేడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Canes Film Festival) లో రిలీజ్ చేశారు. దీనికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
నీర్జా, మైదాన్ వంటి ప్రముఖ చిత్రాల రచయిత సైవిన్ క్వాడ్రాస్ దీనికి స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర పోస్టర్‌లో కలాం సిల్హౌట్‌తో మిసైల్ లాంచ్ నేపథ్యం ఉంది. కాగా ఈ బయోపిక్ కలాం ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆధారంగా రూపొందుతోంది.






