- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aamir Khan: ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్ని భావాలు ఒకేసారి అందిస్తుందంటూ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par). ఈ సినిమాకు ఆర్‌ఎస్ ప్రసన్న(RS Prasanna) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ స్పోర్ట్స్ డ్రామాను ఆమిర్ ఖాన్, అపర్ణా పురోచిత్(Aparna Purochit) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో జెనిలియా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఆమిర్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘తారే జమీన్ పర్’ బ్లాక్ బస్టర్ హిట్‌కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈమూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.
అలాగే ఇందులోంచి అప్డేట్స్ కూడా రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు. ‘సితారే జమీన్ పర్’ జూన్ 20న థియేటర్స్‌లోకి రాబోతుందంటూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో ఆమిర్ ఖాన్ బాల్ పట్టుకుని ఏదో టెన్షన్‌లో తల పట్టుకుని కూర్చొని ఉండగా.. ఆయన చుట్టూ కొంతమంది రెండు వేళ్లను చూపిస్తూ కనిపించారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘జూన్ 20న సితారే జమీన్ పార్ సినిమాలో ప్రతి దాన్ని సెలబ్రేట్ చేసుకోండి! ప్రేమ, నవ్వు ఆనందాన్ని ఒకేసారి అనూభూతి చెందండి’’అనే క్యాప్షన్ జత చేశారు. ఇక అది చూసిన ఆమిర్ ఖాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






