- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు ఆ సినిమా నుంచి రూ.100 చాలు.. రూ.125 కోట్లను రిజక్ట్ చేసిన స్టార్ హీరో
ఆమిర్ ఖాన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘సితారే జమీన్ పర్’.

దిశ, సినిమా: ఆమిర్ ఖాన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘సితారే జమీన్ పర్’. కామెడీ అండ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్.ఎస్ ప్రసన్న కుమార్ దర్శకత్వం వహించాడు. ఆమిర్ ఖాన్, అపర్ణ పూరోహిత్ నిర్మించారు. జూన్ 20న వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం నెటిజన్లు ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. ఓటీటీలో కాకుండా డైరెక్ట్ యూట్యూబ్‌లోకి రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యాడట ఆమిర్.
అంతే కాకుండా యూట్యూబ్‌లో పే-పర్-వ్యూ (రూ.100) మోడల్‌లో ఆగస్టు 1వ తేదీ నుంచి రాబోతోంది. అయితే.. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి రూ. 125 కోట్ల ఆఫర్ రాగా దాన్ని కూడా రిజెక్ట్ చేశాడట ఆమిర్. దీనిపై ఆమిర్ వివరిస్తూ.. ‘నాకు ఏ ప్లాట్‌ఫామ్ నుండి ₹125 కోట్లు వద్దు. నా ప్రేక్షకుల నుండి వచ్చే ₹100 కావాలి. ఈ చిత్రం వారి కోసం నిర్మించబడింది. వారి నుంచి నేరుగా రూ. 100 వస్తే చాలు. ఈ సినిమా కలెక్షన్ల కోసం కాదు.. కనెక్షన్ కోసం’ అని తెలిపారు.






