Coolie: రజినీకాంత్ ‘కూలీ’లో బాలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్.. అఫీషియల్ పోస్టర్‌

by Chukka Sudharani |   (  Updated:2025-07-03 14:10:58  IST  )

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’ (Coolie).

Coolie: రజినీకాంత్ ‘కూలీ’లో బాలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్.. అఫీషియల్ పోస్టర్‌
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’ (Coolie). సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిది నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, పూజా హెగ్డే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం ఆగస్టు 14 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో.. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో మరో స్టార్ హీరో భాగం అయ్యారు. ఈ మేరకు ‘కూలీ’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తున్నట్లు తెలుపుతూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ‘కూలీ ప్రపంచం నుంచి దాహాను (ఆమిర్ ఖాన్) పరిచయం చేస్తున్నాము. ఆగస్టు 14 నుండి ప్రపంచవ్యాప్తంగా IMAX స్క్రీన్లలో కూలీ ఆధిపత్యం చెలాయించనుంది’ అంటూ పోస్టర్ రివీల్ చేశారు. ఇందులో ఆమిర్ ఖాన్ సిగార్ పైప్ పీలుస్తూ స్టైలిష్ అవతారంలో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు.

Next Story