- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adi Pinishetti: సౌండ్ థ్రిల్లర్ రాబోతుంది.. ఇంట్రెస్టింగ్‌గా హీరో పోస్ట్
తమిళం (Tamil)తో పాటు తెలుగు (Telugu)లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి

దిశ, సినిమా: తమిళం (Tamil)తో పాటు తెలుగు (Telugu)లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి (Adi Pinishetti). వైవిద్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’ (Shabdam). హార్రర్ థ్రిల్లర్ (Horror Thriller) జోనర్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాకు ‘వైశాలి’ ఫేమ్ అరివజగన్ వెంకటాచలం దర్శకత్వం వహిస్తుండగా.. అలనాటి అందాల తార లైలా (Laila) కీలక పాత్రలో కనపించనుంది.
తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ (Update) ఇచ్చారు చిత్ర బృందం. ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘భయంకమైన ధ్వని వస్తోంది! శబ్దం ఫిబ్రవరి 28 2025న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది! సౌండ్ థ్రిల్లర్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ షేర్ చేసిన పోస్టర్‌లో ఆది పినిశెట్టి ఫియర్ లుక్ ఆకట్టుకుంటోంది. కాగా.. 7జీ ఫిలిమ్స్, అల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ మూవీలో సిమ్రన్, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ స్లే తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
The Sound of Fear is coming! 🔊 #Sabdham is geared up to hit the screens on February 28th, 2025!
— Aadhi🎭 (@AadhiOfficial) December 25, 2024
Get ready for a #SoundThriller ❤️🔥#SabdhamFromFeb28
Starring @AadhiOfficial
An @dirarivazhagan Film
A @MusicThaman Musical
Produced by @7GFilmsSiva pic.twitter.com/p1BDh86rAe






