Aadi Pinisetty: రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితులు.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

by Chukka Sudharani |   (  Updated:2025-08-15 17:14:13  IST  )

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ఆది పినిశెట్టి.

Aadi Pinisetty: రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితులు.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
X

దిశ, సినిమా: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ఆది పినిశెట్టి. ‘ఒక ‘వి’ చిత్రం’ అనే సినిమాతో 2006లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఎన్నో సినిమాల్లో నటించారు. హీరోగా, విలన్‌గా.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో డిఫరెంట్ జోనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘మయసభ’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సీరిస్‌కు దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి స్నేహితులు అయినా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల చుట్టూ తిరిగే ఈ సిరీస్ సోనీలివ్ ఒరిజినల్స్‌లో ఆగస్టు 7 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ వెబ్ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ చెయ్యగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే జోష్‌లో నేడు ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు మేకర్స్. యాక్సిడెంట్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ కూడా రాజకీయాల చుట్టూ తిరిగి ప్రేక్షకుల్లో క్యూరియాసిటినీ నిపింది.

Click For Link..

Next Story