Aadhi Pinisetty: ప్రతిక్షణం 10000 వాట్స్ కరెంట్ షాక్ కొట్టినట్టే ఉంటుంది

by velandi.Saikiran |

ఆది పినిశెట్టి కూడా ఈవెంట్ కు వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖండ 2 సినిమా సరికొత్త చరిత్ర సృష్టించబో

Aadhi Pinisetty: ప్రతిక్షణం 10000 వాట్స్ కరెంట్ షాక్ కొట్టినట్టే ఉంటుంది
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని కూకట్ ప‌ల్లిలో వేదికగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నందమూరి బాలయ్య, హీరోయిన్ సంయుక్త మీనన్ ఈవెంట్ కు వచ్చి సందడి చేశారు. అటు ఈ సినిమాలో విలన్ గా నటించిన ఆది పినిశెట్టి ( Aadhi Pinisetty) కూడా ఈవెంట్ కు వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖండ 2 సినిమా సరికొత్త చరిత్ర సృష్టించబోతుందని వెల్లడించారు.

సరైనోడు సినిమాలో నన్ను అద్భుతమైన విలన్ పాత్రలో చూపించింది బోయ‌పాటి శ్రీను అంటూ గుర్తు చేసుకున్నారు. ఈ అఖండ 2 సినిమా గురించి చెప్తున్నప్పుడు నిజంగా నేను బాలయ్య పక్కన సరిపోతానా అని భావించానని వివ‌రించారు. త‌న‌కు ఇంత అద్భుతమైన ఆఫర్ ఇచ్చిన బోయపాటి శ్రీనుకు థాంక్యూ అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని అద్భుతమైన కాన్వాస్ లో నిర్మించారన్నారు.

అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా పని చేసాం దీనికి కారణం బాలయ్యనే వివ‌రించారు ఆది పినిశెట్టి ( Aadhi Pinisetty). ఆయన చాలా పాజిటివ్ పర్సన్ అన్నారు. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలని ఆశగా ఉందని వెల్ల‌డించారు. డిసెంబర్ 5న అఖండ తాండవం అందరూ థియేటర్స్ కి వచ్చేయండని కోరారు. బాలయ్య ఎనర్జీ, బోయపాటి మా మాస్, తమన్ బిజీయంతో థియేటర్లో కూర్చున్న ప్రతిక్షణం 10000 వాట్స్ కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుందని దీమా వ్య‌క్తం చేశారు ఆది పినిశెట్టి. కాగా ఈ సినిమా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వ‌ర్యంలో తీశారు.

Next Story