సినిమా అంటే బాలయ్యకు పిచ్చి: ఆది పినిశెట్టి

by Gantepaka Srikanth |

సినిమా అంటే బాలయ్యకు పిచ్చి: ఆది పినిశెట్టి

సినిమా అంటే బాలయ్యకు పిచ్చి: ఆది పినిశెట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2 చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నటుడు ఆది పినిశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బోయపాటి శ్రీనుతో రెండోసారి పని చేశాను. ఆయన డైరెక్షన్ నాకు ఇష్టం. ఇప్పటివరకు నేను చాలా క్యారెక్టర్స్ చేశాను.. కానీ మంత్రతంత్రాల చుట్టూ తిరిగే పాత్రలు నేను చేయలేదు. ఫ్యాన్స్‌ రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. బాలయ్య గురించి బయట చాలా వింటుంటాం. కానీ సెట్‌లో ఆయన ఎనర్జీ వేరేలా ఉంటుంది. ఆయన ఉంటే సెట్‌లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. మా నాన్నతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌ను కూడా నాతో పంచుకున్నారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఆయనకు ప్రతి నాయకుడిగా నేను సరిపోతానా? అని అడిగాను. కానీ నన్ను బోయపాటి నమ్మారు. ఈ సినిమాలో చాలా హై మూమెంట్స్ ఉన్నాయి.. ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.. ముఖ్యంగా తమన్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. ఈ సినిమా కోసం బాలయ్య ఎంతో కష్టపడ్డారు. ఎండను సైతం లెక్కచేయకుండా కష్టపడ్డారు. అప్పుడే ఆయనకు సినిమా పట్ల ఉన్న ప్రేమ, పిచ్చి నాకు అర్థమైంది. ఈ సినిమాకు ముందు నుంచి అంతా మంచే జరిగింది. ముఖ్యంగా మంచి నిర్మాతలు ఉన్నారు. వీరి నిర్మాణంలో మళ్లీ మళ్లీ చేయాలని అనుకుంటున్నాను.

బాలయ్య ముక్కు సూటి మనిషి. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడే మనస్తత్వం కాదు. అలాంటి క్వాలిటీ చాలా అరుదుగా ఉంటుంది. ఆయనతో వర్క్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అని ఆది పినిశెట్టి చెప్పుకొచ్చారు.

Next Story