- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాణి లుక్‌లో వారెవ్వ అనిపిస్తున్న యంగ్ బ్యూటీ.. మీరు అది చూశారా అంటూ పోస్ట్
యంగ్ బ్యూటీ ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన ‘లైలా’(Laila) మూవీతో మన ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ ‘కేసరి వీర్’(Kesari Veer) చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి(Sunil Shetty) హీరోగా ప్రిన్స్ ధీమాన్ తెరకెక్కిస్తున్న సినిమాలో సూపర్ పంచోలి, వివేక్ ఒబెరాయ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని చౌహాన్ స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
అయితే తుగ్లక్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్య యోధుడు హమీర్జీ గోహిల్ కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం మే 16న థియేటర్లలోకి రానుంది. ఇక రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఆకాంక్ష శర్మ మహారాణిలా రెడీ అయి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోస్ షేర్ చేసింది. అంతేకాకుండా వాటికి 'మీరు ఇప్పటికైనా కేసరి వీర్ ట్రైలర్ చూశారా..?' అని క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీ అయిన ఈ ముద్దుగుమ్మకు కలిసి వస్తుందేమో చూడాలి.






