- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manamey Movie: థియేటర్లో అట్టర్ ఫ్లాప్ .. కట్ చేస్తే.. ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు సినిమా.. !
ఒకప్పుడు ట్రైలర్ చూసి సినిమా హిట్ అవుతుందా .. లేదా అని చెప్పేవాళ్ళు.

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు ట్రైలర్ చూసి సినిమా హిట్ అవుతుందా .. లేదా అని చెప్పేవాళ్ళు. కానీ, ఇప్పుడు అలా లేదు పక్కా హిట్ అవుతుందనుకున్న సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇటీవలే చిన్న సినిమాగా మన ముందుకొచ్చి ఆడియెన్స్ ను నిరాశపరిచింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ ఆశించినంతగా కలెక్ట్ చేయలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో మాత్రం దూసుకెళ్తుంది.
థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తక్కువే కలెక్ట్ చేసింది. మొత్తం రూ.19 కోట్లను వసూళ్లు చేసింది. ఆ సినిమా ఎదో కాదు.. " మనమే ". హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, అయేషా ఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ ను అందించారు. రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి హైప్ ను క్రియోట్ చేశాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రామ్సే స్టూడియోస్ పతాకం పై ఈ సినిమాని నిర్మించారు.
మనమే మూవీ మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, నాలుగు రోజుల్లోనే ప్రైమ్ వీడియో ట్రెండింగ్ లో టాప్ లోకి దూసుకెళ్ళింది. ఇలా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన అయిన ఈ సినిమా .. ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.






