- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా విడాకులకు మూడో వ్యక్తి కారణం.. సంచలనం సృష్టిస్తున్న హీరో భార్య పోస్ట్.. సింగర్‌తో ఎఫైర్ నిజమేనా?
కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi) ఇటీవల తన భార్యకు విడాకులు ఇవ్వనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసి అందరినీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi) ఇటీవల తన భార్యకు విడాకులు ఇవ్వనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసి అందరినీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన భార్య ఆర్తి(aarti) తన తెలియకుండా డైవర్స్ ఎలా ఇస్తాడని పోస్ట్ పెట్టడంతో వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అంతా అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం వీరి కేసు కోర్టులు కొనసాగుతుండగా.. కీలక మలుపులు తీరుతోందని చెప్పొచ్చు. నిత్యం జయం రవి, ఆర్తి మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. సంచలన పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవల జయం రవి, సింగర్ కెనీషా(Kenisha)తో కలిసి ఓ పెళ్లికి హాజరు కావడంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి.
ఇక వీటిపై ఆర్తి స్పందించి సంచలన పోస్ట్ పెట్టగా.. జయం రవి తాము ఫ్రెండ్స్ అని రూమర్లకు చెక్ పెట్టాడు. ఈక్రమంలో.. తాజాగా, ఆర్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన ప్రకటన విడుదల చేసింది. మూడో వ్యక్తి కారణంగానే తాము విడాకులు తీసుకోబోతున్నామని.. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని అనడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అసలు అందులో ఏముందంటే.. ‘‘నిజం చెప్పాలంటే.. మా వివాహానికి డబ్బు, అధికారం కారణం కాదు. మా పెళ్లిలో మూడు వ్యక్తి ఉన్నాడు. మమ్మల్ని విడగొట్టింది మా మధ్య ఏదో కాదు. మా జీవితంలోకి చీకటిని తీసుకువచ్చింది.
విడాకుల పత్రాలు దాఖలు చేయడానికి చాలాకాలం ముందు ఆమె ఇప్పటికే నా భర్త చిత్రంలో నటించింది. ఇది నా ఊహ కాదు. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. నన్ను నియంత్రించే భార్య అని పిలుస్తారు. కానీ నా భర్తను చూసుకోవడం, మా ఇంటి స్థిరత్వాన్ని బెదిరించే హానికరమైన అలవాట్లు, నమూనాల నుంచి అతన్ని రక్షించింది. కష్టతరమైన సమయంలో కూడా మేము మా కుటుంబ సభ్యులతో నిజమైన క్షణాలను పంచుకున్నాము.మా ప్రేమలో చివరిరోజు వరకు గొడవలే జరిగాయి. పోరాటాలతోనే మేము వివాహం చేసుకున్నాము.
చెప్పులు లేకుండా ఇంటి నుండి బయలుదేరి వచ్చాము. అయితే తన ఆస్తిలోంచి మేము మా వస్తువులను కూడా తెచ్చుకోలేదు. అతను నిజంగా నా బారి నుంచి తప్పించుకున్నట్లు అయితే విడిపోయిన తర్వాత నేరుగా తన తల్లదండ్రుల వద్దకు వెళ్లాలి అనుకుంటున్నాను. ప్రస్తుతం నష్టాన్ని కలిగించే వ్యక్తితో ఉన్నాడు. నీతిగా ఉన్నట్లు మారువేశంలో ఉన్న రెడ్‌జోన్‌తో ప్రయాయం చేస్తున్నాడు’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు ఆ మూడో వ్యక్తి కెనిషా అని అందుకే వీరు విడాకులు తీసుకోబోతున్నారని అంటున్నారు.






