- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి మాస్టర్ ప్లాన్..ఇక ఇండస్ట్రీ షేక్ కావాల్సిందే !
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని...

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని... ఇండస్ట్రీలో... దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas). ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత... ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిందని చెప్పవచ్చు. అయితే అలాంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో... దూసుకెళ్తున్నాడు.
రాజా సాబ్, సలార్ 2 (Salaar 2), స్పిరిట్ ( Spirit) లాంటి సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. ఇప్పటికే ఇందులో ది రాజా సాబ్ సినిమా... రిలీజ్ కు సిద్ధమైంది. ఆ తర్వాత మిగతా సినిమాలు చేయనున్నాడు. ఇందులో స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ హీరో ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో ఈ సినిమా వస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తారని... ఇప్పటికే ఓ రూమర్ బయటకు వచ్చింది. అలాగే ఇందులో హీరోయిన్ గా యానిమల్ బ్యూటీ త్రిప్తి ( Tripthi)నటిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో.. ఓ పవర్ ఫుల్ రోల్ కోసం తమిళ హీరోను తీసుకుంటున్నారట దర్శకుడు సందీప్ రెడ్డి. ఈ మేరకు చర్చలు నిర్వహిస్తున్నారట. అయితే ఆ తమిళ హీరో ఎవరు అనేది మాత్రం బయటికి రాలేదు. అతను విలన్ కనిపిస్తాడా..? లేదా గెస్ట్ లాగా వచ్చి వెళ్తాడా? అనేది తెలియాల్సి ఉంది.






