గొప్ప మనసు చాటుకున్న సూపర్ స్టార్.. చిన్న పిల్లల కోసం కీలక నిర్ణయం

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-23 12:28:56  IST  )

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

గొప్ప మనసు చాటుకున్న సూపర్ స్టార్.. చిన్న పిల్లల కోసం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏజ్‌లో కూడా యంగ్ హీరోస్‌కి గట్టిపోటీ ఇస్తున్నాడు. ఇక రీసెంట్‌గా ఆయన నటించిన ‘తుడరుమ్’(Turadum) మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘హృదయం’(Hrudayam), ‘కన్నప్ప’(Kannappa) వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మోహన్‌లాల్ తన పుట్టిన రోజు సందర్భంగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రెండు గొప్ప కార్యక్రమాలను ప్రకటించారు. బేబీ మెమోరియల్ ఆస్పత్రితో కలిసి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అర్హులైన పిల్లలకు తక్కువ ధరకే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను అందించనున్నట్లు ఆయన తెలిపారు.

‘ కేరళలో చాలా మంది పిల్లలు కాలేయ వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి కాలేయ మార్పిడి అవసరం. అలాంటి కుటుంబాలకు సహాయం చేయడమే నా లక్ష్యం’ అని మోహన్ లాల్ చెప్పుకొచ్చారు. దీంతో పాటు తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘బి ఏ హీరో’ అనే పేరుతో యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాగా సినిమాల్లో సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న మోహన్‌లాల్ 2015లో విశ్వశాంతి ఫౌండేషన్ స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్, నెటిజన్లు రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story