‘VT15’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ ఇద్దరి ఫొటో వైరల్

by Chukka Sudharani |

మెగా ప్రిన్స్ వరుణ్ ప్రస్తుతం తన 15వ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

‘VT15’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ ఇద్దరి ఫొటో వైరల్
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ ప్రస్తుతం తన 15వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘VT15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. యూవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుపుతూ వరుణ్ తేజ్, తమన్ ఉన్న ఫొటో షేర్ చేస్తూ..

‘బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతున్నా వరుణ్ తేజ్ అండ్ తమన్.. VT15 మ్యూజిక్ కోసం సిద్ధం అయ్యారు. బ్లాక్ బస్టర్ మ్యూజికల్ ద్వయం నుండి అద్భుతమైన ఆల్బమ్ కోసం సిద్ధంగా ఉండండి.. టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. సత్య, మిర్చి కిరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇండో-కొరియన్ హర్రర్-కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నారు చిత్ర బృందం. Link

Next Story