- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఆగంతుకుడు.. అరెస్ట్!
హీరో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) ఉదంతం మరవక ముందే.. మరో బాలీవుడ్ సూపర్ స్టార్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : హీరో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) హత్యాయత్నం ఉదంతం మరవక ముందే.. మరో బాలీవుడ్ సూపర్ స్టార్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) కు ముంబైలోని బాంద్రాలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోకి మే 20 రాత్రి 23 ఏళ్ల యువకుడు చొరబడి(Illegally Enters), సల్మాన్ ను కలవాలని నానా హంగామా చేయడంతో సెక్యూరిటీ అతన్ని బలవంతంగా బయటకి పంపింది. అదేరోజు రాత్రి మరోసారి ఆ యువకుడు కారు వెనకాల నక్కి ఇంట్లోకి ప్రవేశించడంతో సెక్యూరిటీ అడ్డుకొని బాంద్రా పోలీసులకు అప్పగించారు.
ఆ యువకుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జితేంద్ర కుమార్ గా గుర్తించారు. అతను సల్మాన్ ఖాన్ అభిమాని అని, సల్మాన్‌ను కలవడానికి ప్రయత్నించాడని, ఎటువంటి ఆయుధాలు అతని వద్ద లేవని పోలీసుల విచారణలో తేలింది. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi Gang) నుంచి బెదిరింపులు, 2024 ఏప్రిల్‌లో సల్మాన్ ఇంటివద్ద కాల్పుల ఘటన తర్వాత ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీని నియమించింది. తాజా పరిణామం మరోసారి సల్మాన్ భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






