"ది ప్యారడైజ్" ఐటమ్ సాంగ్.. రంగంలోకి ఆ హాట్ బ్యూటీ ?

by velandi.Saikiran |

స్పెషల్ ఐటమ్ సాంగ్ పెట్టబోతున్నారట. దీనికోసం తమన్నా భాటియాను రంగంలోకి దింపబోతున్నట్లు

ది ప్యారడైజ్ ఐటమ్ సాంగ్.. రంగంలోకి ఆ హాట్ బ్యూటీ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ది ప్యారడైజ్. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మార్చి 26వ తేదీన రిలీజ్ కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గనుల బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీత స్వరాలు అందిస్తున్నారు. నాని ఈ సినిమాలో రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారట. ఊర మాస్ కథతో వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ మాస్ ఐటెం సాంగ్ పెట్టేందుకు చిత్ర బృందం నిర్ణయం తీసుకుందట. దసరా సినిమాలో సిల్క్ స్మిత పాట తరహాలోనే ఇందులో కూడా స్పెషల్ ఐటమ్ సాంగ్ పెట్టబోతున్నారట. దీనికోసం తమన్నా భాటియాను రంగంలోకి దింపబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు హిట్ ఐటమ్ సాంగ్స్ లో చిందులు వేసి సక్సెస్ అయింది తమన్నా. అందుకే ఆమె పేరును పరిశీలనలో ఉంచారట. ఫైనల్ అయితే అధికారిక ప్రకటన కూడా రానుంది.

Next Story