‘కుబేర’ నుంచి మీ సోల్‌ను షేక్ చేసే సాంగ్ వచ్చేస్తుంది.. క్యూరియాసిటీ పెంచుతున్న హీరో పోస్టర్

by Gugulothu.Kavitha |

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

‘కుబేర’ నుంచి మీ సోల్‌ను షేక్ చేసే సాంగ్ వచ్చేస్తుంది.. క్యూరియాసిటీ పెంచుతున్న హీరో పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ‘కుబేర’(Kubera) నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులు కావడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. దీంతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 20న పాట విడుదల కానుండగా.. తాజాగా ప్రోమోను రిలీజ్ చేశారు.

‘పోయిరా.. పోయిరా.. పోయిరా మావ.. అరె రాజులాగా దర్జాగా పోయిరా మావ’ అంటూ సాగిన ఈ ప్రోమో సాంగ్ ఆకట్టుకుంది. అయితే ఈ నేపథ్యంలో కుబేరా మూవీ టీమ్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో ‘మీ సోల్‌ను షేక్ చేసే సాంగ్ 20న వచ్చేస్తుంది’ అని వెల్లడిస్తూ హీరో ధనుష్ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచేస్తుంది. కాగా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ రాశారు.

Next Story