ఒక్క లైక్ 2 మిలియన్ల ఫాలోవర్లను తెచ్చిపెట్టింది.. ఎంతా ఖాళీగా ఉన్నామో అంటూ రకుల్ హాట్ కామెంట్లు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-30 03:50:42  IST  )

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల నటి అవనీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టును లైక్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

ఒక్క లైక్ 2 మిలియన్ల ఫాలోవర్లను తెచ్చిపెట్టింది.. ఎంతా ఖాళీగా ఉన్నామో అంటూ రకుల్ హాట్ కామెంట్లు
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Viral kohli) ఇటీవల నటి అవనీత్ కౌర్ (Avaneeth kour) ఇన్‌స్టాగ్రామ్ పోస్టును లైక్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై విరాట్‌ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అయితే, ఈ ఒక్క లైక్‌తో అవ్‌నీత్ కౌర్‌కు ఏకంగా 2 మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు. దీనిపై తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet singh) హాట్ కామెంట్లు చేశారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మనం ఎంత ఖాళీగా ఉన్నామో దీన్ని బట్టి అర్థం అవుతోందని ఏకి పారేశారు. విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీ ఒక లైక్ కొట్టినా సరే అది ఇంత పెద్ద న్యూస్ అవడం అంటే బాధకరమన్నారు. అతను లైక్ చేశాడో లేదో లేదా తప్పుగా జరిగిందో అది ఇక్కడ ఎవరికి అనవసరం అన్నారు. ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దయచేసి ఇలాంటి వాటిని పెద్దది చేయొద్దన్నారు. ఎందుకంటే.. అది ఒక వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయన్నారు.

ఏప్రిల్ 30వ తేదీన నటి అవనీత్ కౌర్ కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ తొలుత లైక్ చేసినట్లు కొందరు నెటిజన్లు గమనించారు. అయితే, కొద్దిసేపటికే ఆ లైక్‌ను ఆయన తొలగించారు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో, కోహ్లీ ఫ్యాన్ పేజీల్లో షేర్ చేయడంతో విషయం వైరల్‌గా మారింది. అయితే తన ఫీడ్‌ను క్లియర్ చేస్తున్న సమయంలో ఇది పొరపాటున జరిగిందని, ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం కారణంగా పొరపాటున పోస్టుకు లైక్ జరిగిందని, దాని వెనుకు ఎలాంటి ఉద్దేశం లేదని విరాట్ అప్పుడే వివరణ ఇచ్చారు.

Next Story