‘రాపో-22’ సినిమా నుంచి రొమాంటిక్ మెలోడీ.. వచ్చేది ఆ స్పెషల్ డే నాడే!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22’(Rapo-22).

‘రాపో-22’ సినిమా నుంచి రొమాంటిక్ మెలోడీ.. వచ్చేది ఆ స్పెషల్ డే నాడే!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22’(Rapo-22). ఈ సినిమాకు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మైవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెని, రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. ఇక దీనికి ద్వయం వివేక్, మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. అయితే షూటింగ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదలవుతూ అంచనాలను పెంచుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. రాపో-22 నుంచి ఓ రొమాంటిక్ మెలోడీ రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు కానుకగా.. మూవీ మేకర్స్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నట్లు టాక్. అయితే ఈ సినిమా కోసం రామ్ పోతినేని పాట రచయితగానూ మారినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారడంతో అది తెలుసుకున్న వారంతా సాంగ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

Next Story