Pushpa 2: బాలీవుడ్ లో కొత్త రికార్డ్.. 'పుష్ప2' డే వన్ కంటే మూడో రోజే కలెక్షన్స్ ఎక్కువ

by Phanindra |   (  Updated:2024-12-11 06:40:59  IST  )

ఈ క్రమంలోనే మూవీకి అక్కడ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి

Pushpa 2: బాలీవుడ్ లో కొత్త రికార్డ్..   పుష్ప2 డే వన్ కంటే మూడో రోజే కలెక్షన్స్ ఎక్కువ
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న( Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన సినిమా "పుష్ప 2" (Pushpa 2). సుకుమార్ ( Sukumar ) దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5 న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం, "పుష్ప 2" మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తుంది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించి నార్త్ లో కూడా దూసుకెళ్తుంది. హిందీ ప్రేక్షకులు 'పుష్ప2' ను ఓన్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే మూవీకి అక్కడ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. డిసెంబర్ 05 న విడుదలైన ఈ మూవీ మొద‌టి రోజు హిందీలో రూ.72 కోట్ల క‌లెక్ష‌న్లు మాత్రమే వసూలు చేయగా.. తాజాగా, మూడో రోజు ఏకంగా రూ.74 కోట్ల వ‌సూళ్ల‌ను కలెక్ట్ చేసింది. అంటే ఫస్ట్ డే తో పోల్చుకుంటే మూడో రోజు కలెక్షన్స్ మరింత పెరిగాయి.

హిందీలో మూడు రోజుల్లో ఈ సినిమా రూ.205 కోట్లు రాబట్టిన మొదటి తెలుగు చిత్రంగా 'పుష్ప2' నిలిచింది. దీని బట్టే అర్ధం చేసుకోవాలి అల్లు అర్జున్ కు నార్త్ లో ఏలాంటి క్రేజ్ ఉందనేది.

Next Story